ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయదుర్గంలో వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం - రాయదుర్గం వెంకటేశ్వర స్వామి రథోత్సవం

రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ వేదపండితులు, ప్రధాన అర్చకులు, ఆలయకమిటీ వారు స్వామి వారికి పూజలు నిర్వహించారు.

rayadurgam rathostavam
rayadurgam rathostavam

By

Published : May 29, 2021, 6:13 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుప్రసిద్ధ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీవారికి వేద పండితులు, ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీదేవి , భూదేవి సమేతులైన ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ, పవిత్ర జలాలతో గంగపూజ, పంచామృతాభిషేకం, బంగారు, వెండి, ఆభరణాలు వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించారు.

గణపతి, నవగ్రహ, శాంతి హోమాలు, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలతో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మడుగు తేరులో ప్రతిష్టించారు. వివిధ రకాల పుష్పాలతో మడుగు తేరు అలంకరించి గోవిందా, శ్రీనివాస, నారాయణ నామస్మరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు రథాన్ని లాగారు. రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details