అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీలోని బి.కొట్టాల వద్ద వీర నారాయణ స్వామి జాతర ఘనంగా జరిగింది. వీర నారాయణ స్వామిని గద్దెపై ఉంచి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతరలో ప్రత్యేకత ఏంటంటే పూజారులు స్వామివారిని ఆవాహన చేసుకొని నేలపై పడుకున్న భక్తులను కాలితో ఆశీర్వదిస్తారు. ఇలా ఆశీర్వాదం అందుకోవడాన్ని భక్తులు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఎన్నో తరాలుగా ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వీరనారాయణ స్వామిని దర్శించుకునేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రైతులు తమ ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను స్వామి వారి గద్దె చుట్టూ ప్రదర్శన చేయించారు. తమ కోరికలు తీర్చాలని వేడుకుంటూ... తడి దుస్తులతో స్వామివారి గద్దె ముందు మోకరిల్లారు.
ఆయన తొక్కు తొక్కారంటే .. భక్తులు పరవశించిపోతారంతే! - ఘనంగా వీరనారాయణ స్వామి జాతర
అర్చకులు భక్తులను చేతులతో ఆశీర్వదించడమే మనకు తెలుసు. కానీ.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం బి.కొట్టాల వద్ద నిర్వహించే వీరనారాయణ స్వామి జాతరలో మాత్రం భక్తులను కాలితో ఆశీర్వదిస్తారు పూజారులు. ఈ వింత ఆచారం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతోంది. మరి ఆ విశేషాలు మనమూ తెలుసుకుందామా..!
ఘనంగా వీరనారాయణ స్వామి జాతర
TAGGED:
ఘనంగా వీరనారాయణ స్వామి జాతర