అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో.. దుండగులు నిన్న రాత్రి తవ్వకాలు జరిపారు. సొరంగ మార్గం తవ్వినట్లు ఉన్న రంధ్రాన్ని.. ఉదయం పూజ కోసం వెళ్ళిన భక్తులు గమనించారు. ఆలయ గోపురాన్ని పడగొట్టి.. శిఖరంపై తవ్వకాలు జరిపారని ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఘటనపై ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తవ్వకాలపై దర్యాప్తు చేపట్టారు. గతంలో ఇదే ఆలయంలో వీరభద్ర స్వామి మూల విరాట్, గణనాథుడు, బసవన్నల విగ్రహాలను దుండగులు దోచుకెళ్లారు. గుప్త నిధుల కోసమే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.