వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో, భక్తుల సాయినామస్మరణతో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. ఏటావిజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రశాంతి నిలయంలో యజ్ఞాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయికుల్వంత్ ధ్యానమందిరంలో వేదపండితులు మంగళవాయిద్యాలు, వేదపఠనం, స్వస్తి వాచకంతో ప్రతిష్ఠించిన కలశం వద్ద గణపతి పూజలు నిర్వహించారు. రాజమదహేంద్రవరానికి చెందిన మైలవరపు సూర్యనారాయణ, దంపతులు కంకణధారణ చేశారు. ఏడు రోజులు పాటు సాగే యజ్ఞం పూర్ణహుతితో విజయదశమి రోజున ముగియనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వినయ్ కుమార్ సింగ్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పుట్టపర్తిలో వేదపురుష సప్తాహజ్ఞాన యజ్ఞం - వేదపురుష సప్తాహజ్ఞాన యజ్ఞం వార్తలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం వేద మంత్రాలతో మారు మోగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ వేదపురుష సప్తాహజ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది.
పుట్టపర్తిలో వేదపురుష సప్తాహజ్ఞాన యజ్ఞం