ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుణదేవా కరుణించవా!! - singhanamala mla padmavathi

అనంతపురంలోని శింగనమలలో స్థానికులు వరుణయాగం నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు ఐదు, ఆరు సంవత్సరాలుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని... వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థించారు.

తులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం

By

Published : Jul 18, 2019, 11:51 PM IST

తులు సుభిక్షంగా ఉండాలని వరుణయాగం

వర్షాల కోసం అనంతపురం ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో పూజలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహించారు. ఐదారేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే అన్నారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాగంతో అయినా వరుణుడు కరుణించాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details