దుర్గంలో ఘనంగా వరుణ యాగం - sri jambukeswara swamy temple news
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని రాయదుర్గంలో సుప్రసిద్ధ శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించారు. ఈ యాగానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్రాహ్మణులకు కాపు రామచంద్రారెడ్డి నిత్యావసరాలు సంభావనగా అందజేసి ఆశీస్సులు పొందారు.
అనంతపురం జిల్లా రాయదుర్గంలో సుప్రసిద్ధ శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని ఆలయంలో వరుణ జపం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణులు తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి పవిత్ర జలాలతో గంగపూజ, గణపతి పూజ , పంచామృతాభిషేకం, శాంతి హోమము, వరుణ యాగము, పుష్పాలంకరణ, మహా మంగళ హారతి వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాయదుర్గం దేవాదాయశాఖ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.