Valmiki Garjana Sabha in Protest Against Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దుతుగా కదం తొక్కిన వాల్మీకిలు.. బాబు అరెస్టుకు నిరసనగా మహా సభ Valmiki Garjana Sabha in Protest Against Chandrababu Arrest:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టైన రోజు నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో తమ ఆందోళనలునిర్వహిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా బాబుకు ఆరోగ్యం బాగు కావాలని పూజలు, ప్రార్ధనలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సుప్రీంకోర్టులో బాబుకు (Chandrababu Case in Supreme Court) ఊరట లభించాలని వేడుకుంటున్నారు.
TDP Agitations Continues Against Chandrababu Arrest: బాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ..రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
అనంతపురం జిల్లా రాప్తాడులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా వాల్మీకి గర్జన సభను (Valmiki Garjana Sabha) ఏర్పాటు చేశారు. ఈ సభకు మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు బీకే. పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. చంద్రబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో వాల్మీకి గర్జన సభకు హాజరై తమ మద్దతు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి వాల్మీకిలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆనాడు వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చడానికి కేంద్రం ముందు ఉంచిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు.
TDP Leaders Protest In West Godavari : 'పశ్చిమ'లో టీడీపీ నేతల నిరసన... 'గడప గడపకు బాబుతో నేను'
వాల్మీకిలు ఎస్టీలలో చేరాలనే కోరిక నెరవేరాలంటే కచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి వాల్మీకి కోరుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును జగన్ కంటే మెజారిటీతో గెలిపించాలని వాల్మీకి మహిళా నాయకురాలు స్వాతి పిలుపునిచ్చారు. వాల్మీకిల ఎస్టీ జాబితా సాధించాలంటే 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమంగా అరెస్టు(Chandrababu Arrest) చేసి 45 రోజులుగా జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కేవలం కక్ష సాధింపుతో జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని దానికోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు.
TDP Protests Against Chandrababu Arrest: అధినేత కోసం అలుపెరగని పోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుల వల్ల న్యాయస్థానాలపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని టీడీపీ నేత పరిటాల సునీత (Paritala Sunita) అన్నారు. కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. చంద్రబాబుకు వాల్మీకిలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వాల్మీకిలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో ఈ సైకో పాలనపై యుద్ధం చేయాలని సునీత పిలుపునిచ్చారు. అరాచక అవినీతి శక్తులను అంతమొందించాలంటే ప్రజలంతా ఏకమవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని.. సైకో జగన్ పోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని అన్నారు.