రైతుల ప్రయోజనాలకు చరమగీతం పాడేందుకే వ్యవసాయ పంపు సెట్లకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏపీ రైతు సంఘం పోరాట సమన్వయ కమిటీ అనంతపురంలో శనివారం నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వం వెంటనే 22, 68 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'విద్యుత్ మీటర్లతో రైతుల ప్రయోజనాలకు నష్టం'
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
vadde sobhanadreeswara rao
మరోవైపు.. వ్యవసాయ చట్టాలపై రాష్ట్రాలతో ఏమాత్రం చర్చించకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. అమరావతిలో రైతులు.. రాజధాని పరిరక్షణ కోసం మూడు వందల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.