తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆస్థాన పూజలు వేడుకగా జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేతనారసింహుడిని అర్చకులు శోభాయమానంగా అలంకరించి ఉయ్యాలోత్సవం నిర్వహించారు. అనంతరం పండితులు పంచాంగ పఠనం నిర్వహించారు. స్వామివారి ఉయ్యాలోత్సవ సేవను తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
కదిరి లక్ష్మీనరసింహ స్వామికి ఉయ్యాలోత్సవ సేవ - Uyyalotsava seva to Kadiri Lakshminarasimha Swami
అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకుని ఆస్థాన పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారికి ఉయ్యాలోత్సవ సేవ నిర్వహించారు.
![కదిరి లక్ష్మీనరసింహ స్వామికి ఉయ్యాలోత్సవ సేవ కదిరి లక్ష్మీనరసింహ స్వామి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11395739-641-11395739-1618375438522.jpg)
Kadiri Lakshminarasimha Swami