ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Uravakonda Police Cracked Student Leader Murder Case in Anantapur : ప్రేమకు అడ్డొచ్చాడని.. అడ్డు తొలగించుకున్నాడు.. కానీ - అనంతపురం జిల్లా నేర వార్తలు

ప్రేమకు అడ్డు రావడమే కాకుండా.. వేధిస్తున్నాడన్న కోపంతో.. ఓ విద్యార్థి సంఘం నాయకుడి.. హత్యకు పథకం వేశాడు ప్రేమికుడు. అదే గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ప్లాన్ అమలు (Uravakonda Police Cracked Student Leader Murder Case in Anantapur) చేశాడు. తొలుత అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. విచారణలో అసలు నిజాలు తెలిశాయి. ఆ వ్యక్తి అదృశ్యం కాలేదని, అంతం చేయబడ్డాడని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...

Uravakonda Police Cracked Student Leader Murder Case
ప్రేమికులను వేధించాడు...చివరికి..

By

Published : Nov 27, 2021, 10:32 PM IST

Updated : Nov 28, 2021, 5:37 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన ముండ్ల తిరుపాల్ విద్యా సంఘం నాయకుడు(Student leader Tirupal murder). అదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి, ఓ యువతి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగటం తిరుపాల్ చూశాడు. వారిని అనుసరించాడు. గురుమూర్తి తన ప్రేయసితో సన్నిహితంగా ఉన్న సన్నివేశాన్ని చూశాడు. అవకాశాన్ని వదలకూడదనుకున్నాడో ఏమో.. వారి విషయం ఎవరికీ చెప్పకూడదంటే తనకు డబ్బులు ఇవ్వాలని యువతిని తరుచూ డిమాండ్ చేసేవాడు. వెంటబడి వేధించేవాడు. వేధింపులు భరించలేని యువతి తన ప్రియుడు గురుమూర్తికి(Gurumurthi planned for Tirupal murder) విషయం చెప్పింది. కొంతకాలం గురుమూర్తి సహించాడు. తిరుపాల్ వేధింపులు హద్దుమీరటంతో భరించలేక అతన్ని అంతమొందించాలని గురుమూర్తి నిర్ణయించుకున్నాడు.

తిరుపాల్ హత్యకు పథకం..
తిరుపాల్ ను హత్య చేయించేందుకు గురుమూర్తి అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తితో 3.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎర్రిస్వామి తన స్నేహితులైన సునీల్, మఠం వేణుగోపాల్ తో కలిసి పథకం రచించాడు. అనుకున్న ప్రకారం విందు చేసుకుందామని గతనెల 24న తిరుపాల్ ను చింతలంపల్లి రోడ్డులోని(Chintalampalli road) కనుమమిట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశారు. ద్విచక్రవాహనం, హత్యకు ఉపయోగించిన కత్తులు, మృతదేహానికి రాయినికట్టి కమలపాడు వద్ద వ్యవసాయబావిలో(Dead body dropped in agriculture well) పడేశారు.

ఎలా బయట పడింది..?
తిరుపాల్ కనిపించడం లేదని వజ్రకరూరు ఠాణాలో(Missing case registered in Police station) కేసు నమోదు కావడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. విచారణలో భాగంగా ఈనెల 5న తిరుపాల్ మృతదేహం బావిలో తేలింది. తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు ఉందంతం బయట పడింది.

పోలీసుల అదుపులో నిందితులు..
శుక్రవారం వజ్రకరూరు సమీపంలోని రైతు భరోసా కేంద్రం(raithu Bharosa Center at Vajrakaroor) వద్ద ఎర్రిస్వామి, సునీల్, వేణుగోపాల్ తోపాటు గురుమూర్తి నగదు పంచుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో విచారించిన ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుంది.

పోలీసు బృందానికి అభినందనలు..
హత్యకేసు ఛేదించడంలో ప్రత్యేక చొరవ చూపిన పోలీసు బృందానికి అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప(Ananthapuram district SP) ప్రశంసాపత్రాలు, రివార్డు అందించారు. వాటిని డీఎస్పీ నరసింగప్ప సిబ్బందికి అందించారు. ఈ కేసు విచారణలో ఉరవకొండ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో వజ్రకరూరు ఎస్ఐ వెంకటస్వామి, ఆయా పోలీసు స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు నాగభూషణ, జాఫర్, మోహన్, చంద్రశేఖర్, పాపానాయక్, ఓబుళేసు, సిద్దా రాఘవేంద్ర, బాలరాజు, రమేష్, మైనుద్దీన్ తదితరులకు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : Power Disconnect in Ananthapur : జనాల ఇళ్లకో న్యాయం.. సర్కారు ఆఫీసులకో న్యాయమా?

Last Updated : Nov 28, 2021, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details