గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరవకొండ మండలం చిన్న ముష్టురు, మోపిడి గ్రామాల్లో ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గినప్పటికీ బావుల్లో నుంచి నీరు బయటకు వస్తుండడంతో ఈ రెండు గ్రామాల్లోని వీధులు వరద కాలువలుగా మారాయి. పది రోజులకు పైగా వీధిలో పారుతున్న నీటి కారణంగా నివాసాల్లో నీళ్లు ఊరుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు బెడద అధికంగా ఉందని.. వృద్ధులు, మహిళలు నీటిలో నడవడానికి ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నరు. అధికారులెవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని..వెంటనే నీరు బయటకు వెళ్లి మార్గం చూడాలని వారు కోరుతున్నారు. పలు కాలనీల్లో అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపటడ్డంతో వరద నీరు బయటకు వెళ్లకుండా ఆగిపోయాయని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో దామోదర్‌రెడ్డి అన్నారు. నీరు నిల్వకాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు - ఉరవకొండలో వరద నీరు వార్తలు
భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో ఉరవకొండ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గినప్పటికీ బావుల్లో నుంచి నీరు బయటకు వస్తోంది. వీధులన్నీ వరద కాలువలుగా మారిపోయాయి. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

uravakonda-people
భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలు