గత ప్రభుత్వ హయాంలో అర్హులైన 3,086 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేస్తే... వాటిని తొలగించేందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులను రీసర్వే పేరుతో ఒత్తిడి చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం భారీ పాదయాత్రతో తహసీల్దార్ కార్యాలయాన్ని తెదేపా శ్రేణులు ముట్టడించాయి. గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు మంజూరు చేసే సమయంలో అభ్యంతరం తెలపని అప్పటి వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి... ఇప్పుడు రీ సర్వే పేరుతో అర్హులైన తెదేపా సానుభూతిపరుల పేర్లను తొలగించే కుట్ర చేస్తున్నారని కేశవ్ ఆరోపించారు.
'తెదేపా సానుభూతిపరుల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకే రీసర్వే' - వైసీపీ ప్రభుత్వంపై పయ్యావుల కేశవ్ వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకు వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ముట్టడించారు. తెదేపా సానుభూతిపరుల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకు అధికారులు రీసర్వే చేపడుతున్నారని పయ్యావుల ఆరోపించారు.
mla payyavula kesav
అర్హులైన వారెవ్వరూ భయపడవలసిన అవసరం లేదని, అవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మంజూరు చేసిన ఇళ్లని పయ్యావుల కేశవ్ అన్నారు. రద్దు చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చదవండి :త్వరలోనే వైకాపా సర్కారు పతనం ఖాయం: పోతిన మహేశ్