అనంతపురం జిల్లా అమరాపురం మండలం ఉప్పరపల్లిలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంచార కుటుంబాలకు స్థానిక ఎస్ఐ సహాయం అందించారు. బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆగలి మండలం ఇరిగేపల్లికి వలస వచ్చిన 19 మంది వ్యక్తులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.
ఆపద సమయంలో ఆసరా..అన్నార్తులకు సాయం
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నందున పనులు లేక పస్తులుంటున్న అన్నార్తులకు పలువురు సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకువచ్చి పేదలను ఆదుకుంటున్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఉప్పరపల్లి ఎస్ఐ