అనంతపురం జిల్లా నార్పల మండలం కూరగానిపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా దాదాపు 14 బావులు మంజూరవగా... అందులొ కేవలం నాలుగు బావులు మాత్రమే పూడికతీత పనులు పూర్తయ్యాయి. ఒక్కొక్క బావికి దాదాపు 90 వేల నుంచి లక్ష రూపాయల బిల్లు మంజూరు చేశారు. 10 బావులకు సంబంధించిన పూడికతీత పనులు చేయకపోయినా... చేసినట్టు బిల్లు మంజూరు చేశారు. మంజూరైన బావి పూడికతీత పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని రైతులు వాపోయారు. అధికారుల కుమ్మక్కుతో లక్షలు సొమ్ము చేసుకొన్నారని ఆరోపించారు. పనికి రాకపోయిన వారికి, పనికి వెళ్లిన వారికి ఒకే కూలి ఇచ్చిన పరిస్థితుల్లో.. నిజమైన లబ్దిదారులకు అన్యాయం జరిగిందని ఆవేదవ చెందారు. అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు.
''జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు'' - జాతీయ ఉపాధిహామీ పథకంలో భారీగా అవకతవకలు....
జాతీయ ఉపాధి పథకం కిందబావి పూడికతీత పనుల్లో భారీగా అవకతవకలు జరిగాయని అనంతపురం జిల్లా నార్పాల రైతులు ఆరోపించారు.

జాతీయ ఉపాధిహామీ పథకంలో భారీగా అవకతవకలు....