అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని ఒంటారెడ్డిపల్లి గ్రామంలో మతి స్థిమితం లేని గంగమ్మ అనే మహిళ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. మానసికంగా ఎదగనప్పటికీ వయసోచ్చిందని ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. కొన్నాళ్లకు గర్భం దాల్చిన మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డుకు ఆలనా పాలనా చూడలన్న విషయం తెలియక పోవడట కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు బాలక్రిష్ణమూర్తి, వైద్యాధికారి అరుణకుమారి, సీడీపీఓ వరలక్ష్మి, ఎంపీహెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు తదితరులు శిశువు పోషణ నిమిత్తం చైల్డ్ కేర్‌కు తరలించారు. తల్లీ, బిడ్డలను జిల్లా కేంద్రానికి తరలించి అక్కడ కొద్ది రోజులు సంరక్షణలో పెట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ఆమె ఓ పసిబిడ్డ... ఆమెకో పసిబిడ్డ
మతి స్థిమితం సరిగా లేని మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని ఒంటారెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు స్పందించి తల్లి, బిడ్డలను సంరక్షణ నిమిత్తం స్త్రీ, శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఆడబిడ్డకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ