మడకశిరలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం - madakashira latest news
అనంతపురం జిల్లా మడకశిరలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక శ్రీ మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవస్థానం పరిసర ప్రాంతంలోని కొండపై మహిళ శవం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.