అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని శివ ప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. శివ ప్రసాద్ అనంతపురం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై వెనకవైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలతో శివ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి - ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వత దేవరపల్లి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని శివ ప్రసాద్ (23) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న కనగానపల్లి పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి..
సంఘటన స్థలంలో మృతుడి కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోస్ట్ మార్టం నిమిత్తం శివ ప్రసాద్ మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: విషాదం: చెరువుకుంటలో దూకి భార్య, చెట్టుకు ఉరేసుకుని భర్త ఆత్మహత్య!