అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ హిందూపురం పట్టణంలో పర్యటించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సులభ్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు.
అలా చేయాలని చెప్పాం: జేసీ