ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేరుశెనగ కుప్పలను దగ్దం చేసిన గుర్తు తెలియని దుండగులు - అనంతపురం తాజా వార్తలు

ఉరవకొండ మండలం లత్తవరం తండాలో గుర్తు తెలియని వ్యక్తులు...ఆంజనేయులు అనే వ్యక్తికి చెందిన వేరుశెనగ కుప్పలకు నిప్పంటించారు. సుమారు రూ. 4 లక్షల విలువైన వేరుశెనగ పంట దగ్ధమైంది.

వేరుశెనగ కుప్పలను దగ్దం చేసిన గుర్తుతెలియని దుండగులు
వేరుశెనగ కుప్పలను దగ్దం చేసిన గుర్తుతెలియని దుండగులు

By

Published : Nov 15, 2020, 4:27 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండాలో... ఆంజనేయులు నాయక్ అనే రైతుకు చెందిన వేరుశెనుగ వామును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. సుమారు రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇన్ని నెలలు కష్టపడి పండించిన పంట కాలిపోవటంతో రైతు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు.

ABOUT THE AUTHOR

...view details