అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దాలపురం గ్రామానికి సమీపాన ఉన్న విండ్ పవర్ కంపెనీకి చెందిన వ్యర్థ సామాగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు విస్తరించి.. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన చుట్టు పక్కల గ్రామాల వారు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్సై యువరాజు చెప్పారు.
వ్యర్థాలకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు - muddaalapuram latest news
విండ్ పవర్ కంపెనీకి చెందిన వ్యర్థ సామాగ్రికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దాలపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వ్యర్థ సామాగ్రికి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు