Sri Sathya Sai District: శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలో ఉదయం కర్ణాటక బ్యాంక్ వెనుక భాగంలో నాని అనే వ్యక్తి మర్మాంగం తెగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అది గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు విషయం తెలపగా వారు 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రి మద్యం మత్తులో ఉన్న తన కొడుకుని గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అతని మర్మాంగం కోసి పరారయ్యారని. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధితుడి తండ్రి రామానుజప్ప విచారం వ్యక్తం చేశారు.
మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపై అమానుషం.. - మడకశిర పట్టణంలో దారుణం
Sri Sathya Sai District: మడకశిర పట్టణంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మర్మంగాన్ని కోశారు గుర్తుతెలియని వ్యక్తులు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా అతన్ని ఆసుపత్రికి తరలించారు.
Unidentified people cut the body of a drunk man
Last Updated : Oct 22, 2022, 4:24 PM IST