ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య - suicides in markuri vandlapalli news

తనయుడి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం మార్కురి వాండ్లపల్లిలో ఈ ఘటన జరిగింది.

suicide
ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి

By

Published : Feb 13, 2021, 10:03 AM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలం మార్కురి వాండ్లపల్లిలో చలపతి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చలపతి కుటుంబం మదనపల్లెలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అతని కుమారుడు అశోక్​ కుమార్​ ఆరునెలల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

తనయుడు మరణించినప్పటి నుంచి మానసికంగా కృంగిపోయిన చలపతి.. స్వగ్రామంలో ఉన్న పొలం వద్దకు వెళ్లాడు. కుమారుని జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని.. మనస్తాపానికి గురయ్యారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:డ్రైనేజిలో పడి ఏడాదిన్నర బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details