ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడుగు ఉంటేనే రేషన్ సరకు!

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజలను అధికారులు అన్ని విధాలుగా అప్రమత్తం చేస్తున్నారు. తప్పనిసరై బయటకు వచ్చినప్పుడు మాస్కులను విధిగా ధరించడమే కాక.. గొడుగులు కూడా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గొడుగులు ఉండటం వల్ల సామాజిక దూరం సులువుగా పాటించవచ్చని పురపాలిక కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

umbrilla is compulsory for taking ration goods in anantapur dst
umbrilla is compulsory for taking ration goods in anantapur dst

By

Published : May 3, 2020, 5:15 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు వివిధ పనుల కోసం బయటకు వచ్చే వారు మాస్కులు తప్పనిసరిగా వాడాలంటూ అన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రజలకు ఆంక్షలు విధించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో రేషన్, మార్కెట్, నిత్యావసరాల దుకాణాలకు వచ్చే వారు మాస్కులతో పాటు గొడుగు కూడా తప్పనిసరిగా ఉండాలంటూ పురపాలిక కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకు అనుగుణంగానే తాడిపత్రి ప్రజలు గొడుగు తీసుకుని రేషన్ దుకాణానికి వచ్చారు. ఈ చర్యకు ఫలితంగా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడానికి వీలు అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

మద్యం దుకాణాలు కాదు.. అన్న క్యాంటీన్లు తెరవండి'

ABOUT THE AUTHOR

...view details