అనంతపురం జిల్లా ధర్మవరంలో మద్యం కొనుగోలు చేయాలంటే కచ్చితంగా వెంట గొడుగు తెచ్చుకోవాలనే నిబంధన విధించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి నిలబడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. గొడుగు, మాస్కు తెచ్చుకోని వారిని వెనక్కు పంపించారు.
గొడుగు ఉంటేనే మద్యం.. లేకుంటే వెనక్కే - ధర్మవరంలో తెరుచుకున్న మద్యం దుకాణాలు తాజా వార్తలు
అనంతపురం జిల్లా ధర్మవరంలో మందుబాబులు గొడుగు తెచ్చుకుంటేనే మద్యం అమ్ముతామని చెప్పారు దుకాణాదారులు. మాస్కులు వేసుకుని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మద్యం కొనుగోలు చేయాలని సూచించారు.

ధర్మవరంలో మద్యం దుకాణాల వద్ద రద్దీ