జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
తాడిపత్రిలో ఉగాది వేడుకలు.. ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకున్న జేసీ దంపతులు - జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
JC Ugadi Celebrations: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా క్రీడలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో యువతులు, మహిళలు ర్యాంప్ వాక్ చేశారు. వారితో పాటే జేసీ ప్రభాకర్ రెడ్డి దంపతులు ర్యాంప్‌పై నడిచి ప్రజలను ఉత్సాహపరిచారు. తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు గుండు ఎత్తే పోటీల్లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మరి కొందరు మహిళలు కర్ర సాముతో తాడిపత్రి ప్రజలను అలరించి ఔరా అనిపించారు. మరి ఆ వేడుకలను మీరు చూసేయండి..

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు