అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు అంజన్న రథోత్సవ వేడుకలు నిర్వహించారు. సీతా, రామ, లక్ష్మణ సమేత ఆంజనేయ ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ఈ వేడుకలో పాల్గొని.. హారతులు, బలి సమర్పణ చేసి పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతపురంలో వైభవంగా ఉగాది వేడుకలు - కదిరిలో ఉగాది ఉత్సవాలు
అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఊరేగింపులు చేశారు.
ఉగాది ఉత్సవాలు
కదిరిలోని యర్రగుంటపల్లి గ్రామస్థులు గ్రామదేవత పంతుల చెరువు గంగమ్మకు బోనాలు సమర్పించారు. ఈ ప్రాంతంలో ఉగాది పండగ రోజున బోనాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. స్థానికులు ప్లవనామ సంవత్సరం అందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండీ.. టీకా ఉత్సవ్: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్