ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suicide attempt: దొంగతనం నింద మోపారని ఇద్దరు ఆత్మాహత్యాయత్నం! - అనంతపురం జిల్లా వార్తలు

తమపై దొంగతనం నింద మోపారని మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది.

Anantapur
దొంగతనం నిందమోపారని..

By

Published : Jun 22, 2021, 5:38 PM IST

దొంగతనం నింద మోపారని మనస్తాపం చెందిన ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కొజ్జాపల్లి గ్రామంలో తన భార్య బంధువులు శుభకార్యానికి వెళ్లడంతో..రామాంజనేయులు అనే వ్యక్తి మిత్రులతో కలిసి ఇంట్లో డిన్నర్ చేసుకున్నారు. అయితే మరుసటి రోజు ఇంట్లోని బంగారు ఆభరణాలు కనపడకపోవడంతో.. అనుమానంతో శేఖర్, సదానంద మీద గుత్తి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సృహ తప్పి పడి ఉన్న వీరిని గ్రామస్థులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో...మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details