అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి వద్ద విషాదం జరిగింది. ఇద్దరు యువకులు జేసీబీతో పొలంలో పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. జేసీబీ పైభాగం 11 కేవీ విద్యుత్ తీగలకు తగలగా జేసీబీ పైన ఉన్న ఇద్దరూ కిందకి దిగే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. మృతులు ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన పవన్, మల్లమ్మకొట్టాలకు చెందిన అంజిగా గుర్తించారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు మృతి - two young mans died with electrick shock news in ananthapuram district
అనంతపురం జిల్లా సానేవారిపల్లిలో విషాదం జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు.
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతి