ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం - hlc canal

దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు తుంగభద్ర ఎగువ కాలువలో పడి మరణించారు.

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

By

Published : Oct 3, 2019, 7:33 PM IST

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం మాల్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రుద్ర, గంగాధర అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు తుంగభద్ర ఎగువ కాలువలో పడి మృతిచెందారు. గత నెల 30వ తేదీన ఇద్దరు స్నేహితులు కలిసి మాల్యం నుంచి కణేకల్లు మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. 3 రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవటం వల్ల కుటుంబ సభ్యులు అనుమానంతో ఎగువ కాలువ వెంబడి గాలించారు. ఈ క్రమంలో మండలంలోని గరుడచెడు-మీ ఇండ్ల పల్లి గ్రామాల మధ్య హెచ్ఎల్సీ లో గల్లంతయినట్లు గుర్తించారు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఇద్దరు స్నేహితులు మృతిచెందడం వల్ల గ్రామంలో విషాదం నెలకొంది. కణేకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్ఎల్సీ లో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details