అనంతపురం జిల్లా అమరాపురం మండల కేంద్రానికి చెందిన భాగ్యమ్మ, పి.శివరం గ్రామానికి చెందిన అంబిక అనే మహిళలు అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది సాయంతో దాడులు నిర్వహించి వారి నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. మడకశిర కోర్టులో ముద్దాయిలను హాజరుపరచగా న్యాయమూర్తి వారిని 14 రోజులు రిమాండ్కు ఆదేశించారని ఎస్ఐ తెలిపారు.
అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు రిమాండ్ - అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్టు
అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.
అక్రమంగా విక్రయిస్తున్న మద్యం