Road accident: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఘోరంగా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. పెన్నా నది వంతెన పై నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మిదేవి(46), సరస్వతి(45)గా అనే మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో ఇద్దరి అక్కడికక్కడే మృతిచెందారు. శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైయ్యాయి. పేరూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెన్నా నదిలోకి వరద నీరు వచ్చింది. ఆ దృశ్యాలను చూడటానికి మహిళలు వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీని గ్రామస్థులు వెంబడించి... బోరంపల్లి-గోళ్ల గ్రామాల మధ్య పట్టుకున్నారు. ప్రమాదంపై పోలీసులు సరిగా పట్టించుకోలేదంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
Road accident: లారీ బీభత్సం... ఇద్దరు మహిళలు మృతి.. ఎక్కడంటే..? - అనంతపురం జిల్లా తాజా వార్తలు
Road accident: అనంతపురం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. మహిళలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మహిళల అవయవాలు పూర్తిగా ఛిద్రమైయ్యాయి.
లారీ బీభత్సం
Last Updated : Aug 5, 2022, 10:35 AM IST