ఓఎల్ఎక్స్ యాప్లో విక్రయానికి ఉంచిన ద్విచక్ర వాహనాలు అపహరించిన 16 ఏళ్ల బాలుడిని.. అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అరెస్టు చేశారు. కదిరిలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి బాలుడు పారిపోవడానికి యత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు, అనంతపురం జిల్లా హిందూపురం, కర్ణాటకలోని బిళ్లూరులో వాహనాలను తానే ఎత్తుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఇదీ చదవండి:కరోనా విలయం.. ఆ రాష్ట్రాల్లో దయనీయ ఘటనలు