పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు గ్రామ వాలంటీర్లు విధులకు దూరంగా ఉండాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయినా కొందరు వాలంటీర్లు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం పంచాయతీ పరిధిలో.. వైకాపా మద్దతుదారుడు సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ల ధాఖలుకు మంగళవారం వెలుగు కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట వాలంటీర్లు ప్రకాష్, ప్రదీప్ వచ్చి నామినేషన్ పత్రంలో వివరాలను పూరించారు. ఈ విషయం సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో.. ఎంపీడీవో రామకృష్ణ చర్యలు చేపట్టారు. వారిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనల అతిక్రమణ.. ఇద్దరు వాలంటీర్ల సస్పెన్షన్ - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో.. ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకు గ్రామ వాలంటీర్లు విధులకు దూరంగా ఉండాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినా.. పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారంటూ.. కఠిన చర్యలు తీసుకున్నారు.
ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన ఇద్దరు వాలంటీర్ల సస్పెన్షన్