అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి వద్ద చిత్రావతి నదిలో మునిగి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ధర్మవరం పట్టణంలోని కోట కాలనీకి చెందిన ఇలియాజ్.. మంగళవారం స్నేహితులతో కలిసి చిత్రావతి నది వద్దకు వెళ్ళాడు. ఈత కొట్టేందుకు నదిలో దిగడంతో ప్రమాదవశాత్తు మరణించాడు. గమనించిన స్థానికులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆట సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది... - అనంతపురం జిల్లా క్రైం
అనంతపురం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. నీటిలో మునిగి ఒకరు, తల్లిదండ్రులు మందలించారని మనస్తాపంతో మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలతో జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతి
అనంతపురంలో తల్లి మందలించిందని పదకొండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంనగర్లో నివాసముంటున్న లక్ష్మి, నారాయణస్వామి కుమారుడు రోహిత్ ఆరో తరగతి చదువుతున్నాడు. రోహిత్ ఎప్పుడూ చరవాణిలో ఆటలాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. ఫలితంగా మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇదీచదవండి.