తమకు అప్పగించిన పనులు చేసి ఇళ్లకు వెళ్లే అధికారులే ఎక్కువగా ఉంటారు. అదనపు బాధ్యతలను తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అయితే విధి నిర్వహణలో ప్రత్యేకతను చాటుకునే అధికారులు కొందరు ఉంటారు. ఆ కోవకు చెందిన వారే డీఆర్‌ఎం అలోక్‌తివారి, సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి బాలమురళీధర్. రైల్వే విధుల్లో ప్రథమస్థానంలో నిలిచేందుకు నిత్యం కృషి చేస్తున్నారు. సిబ్బందినీ సన్నద్ధం చేసి లక్ష్యాలను సాధించారు. తాజాగా గుంతకల్లు రైల్వే అధికారులు మరో రెండు రికార్డులను సృష్టించారు. ఈపాస్‌లు, ఆరోగ్య కార్డుల జారీలో దేశంలోనే ముందంజలో నిలిచి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
సాంకేతిక తోడ్పాటు
ఈసారి రైల్వే ఉద్యోగులు ప్రయాణించడానికి ఈపాస్‌లను అందించారు. స్టేషన్లకు రాకుండానే చరవాణిల ద్వారా రిజర్వేషన్ పొందడానికి అవకాశం కల్పించారు. అలాగే ఆరోగ్య కార్డులు (ఉమిద్ కార్డు) అందజేశారు. ఈ కార్డులను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఆస్పత్రులకు వెళ్లారు. పొందిన చికిత్స, తీసుకున్న మందులు, రోగాల వివరాలన్నీ అందులో పొందుపరుస్తారు. డివిజన్‌లోని 14,250 మంది ఉద్యోగులకు ఈ సౌకర్యాలను అందుబాటులో తేవడానికి చేపట్టిన ప్రక్రియను గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు రెండునెలల్లో పూర్తి చేశారు. భారత రైల్వేలో తొలుత పూర్తిచేసిన ఘనత గుంతకల్లు పర్సనల్ డిపార్టుమెంటుకు దక్కింది.
ఇవీ రికార్డులు
*రైల్వే ఉద్యోగుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
*ఉద్యోగులు చనిపోతే 24 గంటల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం జరిపారు.
*నిరుద్యోగులు, మహిళలకు కంప్యూటర్, టైలరింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.
*రైల్వే బోర్డు కేటాయించిన 1100 మంది అభ్యర్థులను ఐదు రోజుల్లో ఉద్యోగాల్లో చేర్చుకుని, వారికి చెందిన సర్వీస్ రికార్డులు, వైద్యం కార్డులు, బ్యాంకు ఖాతాల ప్రక్రియ పూర్తి చేశారు.
*ఉద్యోగులందరికీ రైళ్లలో ప్రయాణించడానికి ఈపాస్‌ల సౌకర్యం.
*ఏ రైల్వే ఆసుపత్రిలోనైనా వైద్యం పొందడానికి ఆరోగ్య కార్డుల అందజేత.
అందరి సహకారంతోనే..