అనంతపురం జిల్లా నార్పల మండలం మద్దలపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దలపల్లి సమీపంలోని మలుపు వద్ద స్కార్పియో వాహనం బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరిని కడప విమానాశ్రయంలో వదిలిపెట్టి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
మద్దలపల్లి సమీపంలో స్కార్పియో బోల్తా.. ఇద్దరికి గాయాలు - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా నార్పలలోని మద్దలపల్లి గ్రామసమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
మద్దలపల్లి సమీపంలో స్కార్పియో బోల్తా.. ఇద్దరికి గాయాలు
TAGGED:
అనంతపురం జిల్లా వార్తలు