ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొడవ పడ్డారు... కాసేపటికే తనువు చాలించారు... - అనంతపురంలో ఉరివేసుకుని జంట ఆత్మహత్య

వాలిద్దరూ 14 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కలహాలు పెరిగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గూగూడులో జరిగింది.

two persons suicide with hang at gududu village  Anantapur district
కలహాలతో ఉరివేసుకుని జంట ఆత్మహత్య

By

Published : Sep 24, 2020, 6:18 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో సహజీవనం చేస్తున్న ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే వ్యక్తి.. భార్యను వదిలి 14 ఏళ్లుగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అప్పటినుంచి ఆటో డ్రైవర్​గా పని చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. భోజనం చేయడానికి ఇంటికి వచ్చిన అతను.. ఆమెతో గొడవ పడ్డాడు. కాసేపటికి ఇంట్లో నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడం వల్ల స్థానికులు కిటికీలోంచి చూడగా... ఒకే చీరతో ఇద్దరూ ఉరేసువేసుకోని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫణింద్రనాథ్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details