అనంతపురం జిల్లా కోనఉప్పలాపడు సమీపంలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లి యువకులు చిక్కుకున్నారు. కింద నుంచి ఇద్దరు యువకులు జలపాతం మధ్యలోకి చేరుకున్నారు.
జలపాతం మధ్యలో చిక్కుకున్న యువకులను కాపాడారు ఇలా.. - two persons struck in water falls police resuce news
అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలాపడు గ్రామ సమీపంలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు జలపాతంలో చిక్కుకున్నారు.
జలపాతం మధ్యలో చిక్కుకున్న యువకులను కాపాడారు ఇలా
ఒక్కసారిగా పైనుంచి నీళ్లు అధికంగా రావడంతో ఇద్దరు మధ్యలోనే ఇరుక్కుపోయారు. విషయం తెలుకున్న యాడికి ఎస్సై మల్లికార్జున రెడ్డి, సిబ్బంది, గ్రామస్థులు కలిసి తాళ్ల సహాయంతో ఇద్దరిని సురక్షితంగా కాపాడారు.