అనంతపురం నగర శివారులో 44వ జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. బళ్లారి రోడ్డు ఫ్లై ఓవర్ వద్ద లారీని నగరంలోంచి బయటకు వెళ్తున్న మరో లారీ ఢీ కొట్టింది. ఈ క్రమంలో అదపు తప్పిన ఓ లారీ.. పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలు హరియాణా, తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.