అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెడబల్లి సమీపంలో క్వాలిస్ వాహనం అదుపు తప్పి.. కంచెను ఢీకొని రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు.
కారు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు - పెడబల్లి సమీపంలో కారు ప్రమాదం
క్వాలిస్ వాహనం అదుపు తప్పిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద జరిగిన ఈ ఘటనలో.. రోడ్డు పక్కనున్న పొలం కంచెను కారు ఢీకొట్టింది.
కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులు