ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధానికి ఇద్దరు బలి

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఓ వివాహిత సమీప బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. విషయం తెలిసి వారిని పెద్దలు మందలించారు. ఆవేదనకు గురైన వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

illegal affair
illegal affair

By

Published : Aug 24, 2020, 5:22 PM IST

ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెతోపాటు పురుగు మందు తాగిన ప్రియుడు కూడా మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన అంజలి, బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన యోగానంద్‌ శనివారం ధర్మవరం మండలం సీసీకొత్తకోట బస్టాప్‌ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వారిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజలి ఆదివారం మృతి చెందింది. యోగానంద్ సోమవారం మరణించాడు.

అంజలికి పదేళ్ల కిందట మహేంద్రతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అంజలి సమీప బంధువైన యోగానంద్‌తో వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయంపై బంధువులు మందలించారు. ఈ క్రమంలో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి

ప్రేమ జంట పరారీ... ఇరు కుటుంబాలు ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details