ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి... బంధువుల ఫిర్యాదు - బొమ్మనహాళ్​ మండలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

బొమ్మనహళ్​ మండలం ఎల్బీనగర్​ సమీపంలోని పొలంలో పని చేస్తున్న ఇద్దరు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబీకులు దూరమయ్యారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

two people were died due to current shock
విద్యుదాఘాతంతో మృతి చెందిన రైతులు

By

Published : Oct 27, 2020, 5:01 PM IST

Updated : Oct 27, 2020, 5:18 PM IST

అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం ఎల్బీనగర్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తున్న ప్రసాద్​ అనే రైతు విద్యుత్​ తీగలు తగిలి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ట్రాక్టర్​ డ్రైవర్​ వలీ.. రైతును కాపాడబోయి విద్యుదాఘాతానికి గురయ్యాడు.

వీరిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే తీగలు నేలపై పడి... తమ వారు చనిపోయారంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Last Updated : Oct 27, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details