రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మడకశిర మండలంలోని సి. కొడిగేపల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రంలో రాజస్థాన్‌కి చెందిన పలువురు యువకులు జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం అక్కడ నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు సంజయ్ సింగ్, విక్రమ్ సింగ్ అనే యువకులు వెళ్లారు. ఎంతసేపు చూసినా వారి తిరిగి రాకపోవడం వల్ల తోటివారు అక్కడికి వెళ్లి చూశారు. నీటి తొట్టెలో వారు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇది గమనించిన స్థానికులు వారిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి - అనంతపురం జిల్లాలో ఇద్దరు మృతి
నీటి తొట్టెను శుభ్రం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మృతులు రాజస్థాన్‌కు చెందిన వారుగా గుర్తించారు.
![నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి two people died in ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5674611-877-5674611-1578741815757.jpg)
నీటి తొట్టెలో పడి ఇద్దరు యువకులు మృతి