అనంతపురం నగరానికి చెందిన నారాయణ స్వామి, లింగమ్మ వ్యాపార నిమిత్తం ఉరవకొండకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటో కూడేరు వద్దకు రాగానే అమిద్యాల నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఉన్న చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆటో-ఇన్నోవా ఢీ... ఇద్దరు మృతి - ananthapuram district crime news
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఇన్నోవా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఆటో-ఇన్నోవా ఢీ... ఇద్దరు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇవీచదవండి.