ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హత్య కుట్ర భగ్నం... పిస్టల్ స్వాధీనం - crime news in dharmavaram

అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకరిని హతమార్చేందుకు సిద్ధమైన ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి ఓ పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు.

two people arrested in attempt murder case in dharmavaram
అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు

By

Published : May 7, 2021, 4:20 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్య చేయడానికి వెంట తెచ్చుకున్న పిస్టల్​ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. అనంతపురంలోని జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్​లో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ.. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

"డీఎస్పీ రమాకాంత్ ఆదేశాలతో ధర్మవరం పోలీస్​స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల రైల్వే వంతెన వద్ద పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ వ్యక్తి వద్ద ఉన్న పిస్టల్​ గుర్తించారు. డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సోదాలు చేసి.. కుట్ర విషయం తెలుసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు" అని ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details