ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్.. ఐసోలేషన్​ వార్డుకు తరలింపు - కదిరి తాజా కరోనా వార్తలు

కదిరిలోని హిందూపురం రోడ్డులో ఇద్దరికి కరోనా సోకింది. బాధితులు ఇద్దరిని ఐసోలేషన్​కు పంపించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

two more corona positive cases found in kadiri hindupur road
కంటైన్మెంట్​ జోన్​ అయిన కదిరి హిందూపురం రోడ్డు

By

Published : Jun 21, 2020, 8:20 AM IST

అనంతపురం జిల్లా కదిరిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. హిందూపురం రోడ్డులో ఇద్దరికీ కొవిడ్​ లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. పరిసర ప్రాంతాల్లో అవసరమైన పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు.

ప్రధాన రహదారులపై ఉన్న దుకాణాలను మూసివేశారు. నిబంధనలు పాటించాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. పాజిటివ్​ వచ్చిన వ్యక్తులను ఐసోలేషన్​ వార్డుకు, వీరిని కలిసిన వారిని క్వారంటైన్​కు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details