అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో అక్కమ్మ కొండ పై రెండు చిరుత పులులు కలకలం సృష్టించాయి. ఉదయాన్నే నడక కోసం వెళ్లిన కొంతమంది స్థానికులకు రెండు చిరుతలు కొండపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. దూరం నుంచే పులులను గమనించిన యువకులు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో... వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులే ఆ చిరుతపులులను బంధించి... తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
LEOPARD WANDERING: అక్కమ్మ కొండపై చిరుత పులులు.. భయాందోళనలో ప్రజలు.. - ఏపీలో చిరుతపులుల సంచారం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలో అక్కమ్మ కొండపై రెండు చిరుత పులుల సంచరించడం గమనించిన స్థానికులు... వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియోని చూసిన ప్రతీ ఒక్కరూ తీవ్రంగా భయపడిపోతున్నారు.
అక్కమ్మ కొండపై సేదతీరుతున్న చిరుత పులులు.. భయాందోళనలో ప్రజలు..