అనంతపురం జిల్లా పామిడి మండలం దిబ్బసానిపల్లి గ్రామ సమీపంలోని కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తూ గ్రామాల ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి. గ్రామానికి చెందిన మనోజ్(20) అనే మేకల కాపరి నిన్న మేకలను మేపడానికి కొండ శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లాడు. మేకల గుంపును చూసిన చిరుత పులులు ఒక్కసారిగా గుంపుపై దాడి చేశాయి. ఈ ఘటనలో మూడు మేకలు చనిపోగా మరికొన్ని గాయపడ్డాయి. ఇది గమనించిన మనోజ్ గట్టిగా కేకలు వేశాడు. దీంతో చిరుతపులి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించగా తప్పించుకుని పరారయ్యాడు.
అనంతపురంలో చిరుతల సంచారం...మూడు మేకలు మృతి - latest news in anantapur
పామిడి మండలం దిబ్బసానిపల్లి గ్రామ సమీపంలోని కొండల్లో రెండు చిరుతలు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న అక్కడికి చేరువలో గడ్డి మేస్తున్న మూడు మేకలపై దాడి చేసి చంపేశాయి. ఈరోజు కూడా చిరుతపులి సంచరించటంతో స్థానికులు చూసి ఆ దృశ్యాలను తమ చరవాణిలో బంధించారు.
అనంతపురంలో చిరుతల సంచారం
ఈ రోజు కూడా చిరుతపులి సంచరించటం చూసిన స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిలో బంధించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి చిరుతపులి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ...చిట్టీ చిలకమ్మా... నీ గోలేంటమ్మా?