అనంతపురం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు వద్ద టైర్ పంక్చర్ కావటంతో ఆటో బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందగా... నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉరవకొండ నుంచి చిన్నహోతురు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు గురుస్వామి(50)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఉరవకొండ పట్టణ శివారులో సత్యం పెట్రోల్ బంక్ వద్ద బైక్ను వెనుక నుంచి కారు ఢీకొంది. ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి... నలుగురికి తీవ్ర గాయాలు - road accidents in anantapur district news
అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వజ్రకరూరు మండలం చిన్నహోతూరు వద్ద ఆటో బోల్తా పడింది. ఉరవకొండ పట్టణ శివారులో బైక్ను కారు ఢీకొంది. ఈ రెండు ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా... నలుగురు గాయపడ్డారు.
road accidents