కంటైనర్ వాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి.. - అనంతపురం సమాచారం
అనంతపురం జిల్లా, రామగిరి మండలం, పెనుబోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న కంటైనర్ వాహనాన్ని.. కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లా, రామగిరి మండలం, పెనుబోలు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రహదారిపై నిలిపి ఉన్న కంటైనర్ వాహనాన్ని బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెంగుళూరుకు చెందిన రామారావు అతని కుమారుడు శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కారులోని మరో ఇద్దరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకొన్న రామగిరి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.